సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రఖ్యాత డి.ఎన్ .ఆర్ఇంజినీరింగ్ కళాశాల బేసిక్ సైన్స్ & హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లో ఈ నెల 22 తేదీన అనగా శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పెస్టివెల్ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.అంజన్ కుమార్ గారు తెలిపారు .ఈ సందర్భంగా INFINITO 2 .O ఫెస్ట్ పోస్టర్ని కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కళాశాల లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న మొదటి సంవత్సరం విధ్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించటానికి మరియు సాంకేతిక నూతన నైపుణ్యాలను నేర్చుకోటానికి ఒక అద్భుతమైన వేదిక ఈ INFINITO 2 .O ఫెస్ట్ అని అన్నారు . ఫెస్ట్ లో ప్రాజెక్ట్ ఎక్సపో , పోస్టర్ ప్రెసెంటేషన్, జమ్ (ఎక్సటెంపో ) వంటివి నిర్వహిస్తున్నాం అని తెలిపారు .
