సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, సోమవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని దర్శించుకున్న స్థానిక భీమవరం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వారు దేవాలయ విధుల నిర్వహణకు సహకరించేందుకు 1,20,000. విలువ చేసే 2 కంప్యూటర్స్ కానుకగా అందచేసినారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించినారు. SBI బ్యాంకు రీజనల్ మేనేజర్ S గురవయ్య, చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ రాజు మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికీ శ్రీ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు.
