సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీలోని 4,5,33 వార్డుల పరిధిలో ఆరు కోట్ల 30 లక్షల రూపాయలతో నిధులతో కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ,తో కలసి ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా నరసయ్య అగ్రహారం లో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ గత కొంతకాలంగా అభివృద్ధిలో భీమవరం త్రీ టౌన్ చాలా వెనకబడిందని, నిర్లక్ష్యానికి గురయ్యింది అన్నారు. భీమవరం 3 టౌన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని, మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో బస్ డిపో నుండి కుమ్ముదవల్లి రోడ్డు వరకు సిసి రోడ్ నిర్మాణం చేయటంతో పాటు సెంటర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎటువంటి నిధుల కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని, భీమవరం ప్రజల తాగునీటి సమస్య త్వరలోనే పూర్తి పరిష్కారం అవుతుందన్నారు. ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి సమన్వయంతో అన్ని విధాల భీమవరం లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు,టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,తదితరులు పాల్గొన్నారు.భీమవరం పాత బస్టాండ్ వద్ద మరియు జిల్లా కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ అర్జీదారులు కొరకు ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్సును కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా నేటి ఉదయం ప్రారంభించారు.
