సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వెంకీ మామతో హ్యాట్రిక్ హిట్ గా సంక్రాంతి కి వస్తున్నాం వంటి 300 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమా తరువాత త్వరలో అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారు ఇప్పటికే పూజ కార్యక్రమాలతో వెంకటేష్ ముఖ్య అతిధిగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మే మూడో వారం నుంచి మొదలుకానుంది. కమర్షియల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.అయితే ఒక సంచలన విషయం తాజగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో వెంకీ మామ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని, చిరంజీవి కోరిక మేరకు ఆయన సుమారు 30 నిమిషాల నిడివి కల చిరు మిత్రునిగా నాన్ స్టాప్ నవ్వులు పూయించే పాత్ర (సతి లీలావతి సినిమాలో కమల్ హాసన్ తరహా ) పోషించడానికి అంగీకరించారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇన్నాళ్లకు మెగా విక్టరీ అభిమానులకు వచ్చే సంక్రాంతి పండుగ రోజులు నిజంగానే మరింత జోష్ గా ఉండనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *