సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 రోజులుగా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు అస్సలు నిద్రపట్టడం లేదు. తన సత్తా ఏమిటో ప్రపంచానికి అర్ధం అయిపొయింది. అయినా సరే భారత్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి రాత్రి మన దేశం మీదకు దాడులకు తెగబడుతోంది. డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. అయితే వాటిని నూటికి నూరు శాతం సమర్థంగా తిప్పికొడుతోంది భారత సైన్యం.. అంతే కాదు పాకిస్తాన్ నగరాలపై ఊహించని రీతిలో ఎదురుదాడులతో భస్మీపటలం చేస్తున్నారు. భారత్ ను గోకినప్పుడల్లా పాకిస్తాన్ కు పుండు పడిపోతుంది. ఇది రోజువారీ తీరు.. గత రాత్రి రావల్పిండి తో పాటు పాక్ ఆర్మీ కి సంబందించిన పలు ప్రాంతాలపై భారీ మిసైల్ డ్రోన్ బాంబులతో విరుచుకుపడింది భారత్. నేటి శనివారం తెల్లవారుజామున పాక్‌పై భారత్ మెరుపు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా అక్కడి 4 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశారని సమాచారం. పాక్ సైన్యానికి అత్యంత కీలకమైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు మురిద్, రఫీకీతో పాటు మరో ఎయిర్‌బేస్‌‌ను భారత దళాలు మిసైల్స్‌తో పేల్చేసినట్లు తెలుస్తోంది. పాక్ స్థానిక మీడియా కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఫొటోలు, వీడియోలను టెలికాస్ట్ చేస్తోంది. మిసైళ్ల ధాటికి ఈ ఎయిర్‌బేస్‌ ధ్వంసమైందని, భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయని అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *