సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవులు ముగిసి నేటి గురువారం నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత విద్య సంవత్సరం ప్రకారం.. 1392 ప్రభుత్వ పాఠశాలల్లో 98,235 మంది విద్యార్థులు 344 ప్రైవేటు పాఠశాలల్లో 1,39,826 మంది విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ప్రాథమిక విద్యకు తొలి అడుగుపడే ఒకటో తరగతి నుంచే చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలను ఆశ్ర యించేలా తొలిసారిగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కేజీ, యూకేజీ)ను పూర్తి చేసిన పిల్లలందరినీ సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయిన ప్రెవేటు, కార్పొరేట్ స్కూల్స్ పీజులు చెల్లించలేని సామాన్యులు పేదల పిల్లలు ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలో చేరితే చాలు పుస్తకాలు మొదలుకుని మధ్యాహ్న భోజనం, రాగి జావ, సుశిక్షితు లైన టీచర్లతో అత్యాధునిక విద్యాబోధన వరకు ఉచితమే అందిలే ఏర్పాట్లు జరిగుతున్నాయి. ( మరి ఈ ఏడాది పిల్లల స్కూల్ 3 జతలు యునిపామ్ డ్రెస్, మరియు షూస్ ఇస్తారో? లేదో?) గత ఏడాది ఇవ్వక పోయిన నేటి నుండి పేద విద్యార్థులకు అమ్మకు వందనం క్రింద 15వేలు తిరిగి ఇవ్వడం శుభ సూచికం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *