సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో గత వారం రోజుల వర్షపు ముసురు తరువాత సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు. అయితే పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ నేడు, గురువారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో గోదావరి జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
