సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా గొప్పలు ఇక్కడ చెప్పుకొనే భారతీయులకు అక్కడికి వెళ్లాలని అనుకొనేవారికి ట్రంప్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ యాక్ట్ కింద నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచింది. ఈ ఫీజును ఏకంగా రూ. 26 వేలకు పెంచింది. ఇది వచ్చే ఏడాది అంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై యూఎస్‌లో పర్యటన, ఉన్నత విద్య, ఉద్యోగం. వ్యాపార కోసం వెళ్లే వారు ఈ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది.అలాగే కేవలం పర్యాటన కోసం వెళ్లే వీసా ఫీజును సైతం రూ. 16 వేల నుంచి రూ. 40 వేలకు పెంచింది. యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ కింద 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. అయితే వీటిని వెనక్కి ఇవ్వరు. దీనికి సర్ ఛార్జ్ సైతం అదనంగా వసూల్ చేస్తారు. వీసా జారీ సమయంలో ఈ మొత్తాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. బీ 1, బీ 2 అంటే..హెచ్ 1 బీ అంటే వర్క్ వీసాలు జె అంటే విజిటర్ వీసాలతో ప్రయాణాలు చేసే అందరిపై బాదుడు తప్పదు.. .
