సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏమిటో కాలం తీరు మారిపోయింది. మొన్న ఎండాకాలంలో భారీ వర్షాలు వరుసగా పడితే తీరా వర్షాకాలం వచ్చేసరికి మేఘాల జాడ లేకపోవడంతో అప్పుడప్పుడు చిరు జల్లులు మినహా వేసవిలో మాదిరిగా రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతోంది.గత వారం, పది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి లేదు పగలు లేదు తీవ్ర ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా భీమవరం నరసాపురం లలో సైతం సుమారు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నేడు, ఆదివారం ఎండ మరింత ప్రచండంగా కాస్తుంది. ఉదయం 11 గంటల నుండి ప్రధాన రహదారులు నిర్మానుష్యం అయ్యాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 16న పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో 17వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *