సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం లోక్ సభ సమావేశంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (SAIL)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు. ఈ ప్రశ్న ను సంధించింది ఏపీకి చెందిన ఎంపీలు కాదు.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆదిత్య యాదవ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీనివాస వర్మ స్పందిస్తూ, విశాఖ ప్లాంట్‌ను మరింత సమర్ధవంతంగా పనిచేయించేందుకు ఇటీవల రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందించిందని, విలీనం చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం లేదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *