సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం ఊహించని భారీ నష్టాలతో కకావికలం చేసిన చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నేడు, సోమవారం కాస్త లాభాలతో ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు (79, 857) పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌నుఅధిగమించింది. ఈ నెల 15న ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో కాస్త సానుకాలాంశంగా మారడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో ఉన్నాయి.నేటి సోమవారంవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. పలు రంగాలు లాభాల్లో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 80, 054 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 61 పాయింట్ల లాభంతో 24, 425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 210 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.52గా ఉంది.
