సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 15న ట్రంప్ , పుతిన్ సమావేశం నేపథ్యంలో రష్యా దేశ దాయాది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను వివరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ, రష్యా దాడుల వల్ల అనేక ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలు ధ్వంసమవుతున్నాయని మోదీకి వివరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడం, ముఖ్యంగా చమురు ఎగుమతులపై భారత్ పరిమితులు పెడితే యుద్ధానికి ఆర్థిక వనరులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సమాధానంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారానికే మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. శాంతి స్థాపన కోసం అవసరమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం, సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు నాయకులు ప్రత్యక్షంగా కలుసుకోవాలని నిర్ణయించారు. నిజానికి జెలెన్‌స్కీ భారత్ ను కాశ్మిర్ విషయంలో గతం నుండి వ్యతిరేకిస్తూనే వస్తున్నాడు. మరి ఇప్పుడు భారత్ మద్దతు కావాలంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *