సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రముఖ లాయర్లు కుటుంబంగా పేరు గాంచిన పొడుగు శ్రీనివాస్ (అడ్వకేట్) గారి తల్లి నాగమణి గారు ఈనెల 15న మరణించిన నేపథ్యంలో ఆమె సంస్మరణ దినం కార్యక్రమం ను నేడు, గురువారం మధ్యాహ్నం స్థానిక టౌన్ హాల్ లో ఏర్పాటు చెయ్యగా సన్నిహితులతో, పలువురు న్యాయవాదులుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యి ఆమె మృతికి నివాళ్లు అర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని పొడుగు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
