సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో టాప్ ర్యాంకింగ్ తో ఖ్యాతి గాంచిన.. భీమవరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ యొక్క 8వ గ్రాడ్యుయేషన్ డే “విష్ణోత్సవ్ 2K25” ను కళాశాల యొక్క దక్షిణ క్యాంపస్ లోని విష్ణు కన్వెన్షన్ సెంటర్ నందు వైభవంగా నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 2021-25 బ్యాచ్‌కు చెందిన 670 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, అలాగే 2023-25 బ్యాచ్‌కు చెందిన 35 మంది ఎం.టెక్. విద్యార్థులు మరియు 55 మంది ఎం.బి.ఏ. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్‌లను విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్-చైర్మన్, ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,ప్రపంచం విస్తృత అవకాశాలను అందిస్తున్నందున.. ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు పొందటమే సరిపోదని విజయవంతమైన సంస్థల వ్యవస్థాపకులుగా ఎందరికో ఉపాధి కల్పించే దిశగా ఎదిగేందుకు ఆకాంక్షించాలని వారిని ప్రోత్సహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస రావు.. విద్యార్థులు ఒక మహిళగా జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు ఆనందాన్ని స్వీకరించడానికి స్వీయ ప్రేరణ పొందాలని,వ్యవస్థాపకులుగా మారడానికి స్టార్టప్‌లను ఆచరణీయమైన మార్గంగా పరిగణించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో మొత్తం 760 మంది పట్టభద్రులు, అలాగే 2500 కుపైగా తల్లిదండ్రులు, అధ్యాపక సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *