సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ పదవి స్వీకారోత్సవం నేడు,మంగళవారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉదయం 11 గంటలకు కాస్త నెమ్మదించడంతో స్థానిక మార్కెట్ యార్డ్ లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏఎంసి నూతన చైర్ పర్సన్ గా కలిదిండి సుజాత వైస్ చైర్మన్ బండి రమేష్ మరియు డైరెక్టర్లు చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ..ఉదయం నుండి టెంక్షన్ పడ్డామని అయితే.. ఎదో దైవ సంకల్పంగా భారీ వర్షం సైతం తగ్గడం తో ఈ కార్యక్రమం వాయిదా పడకుండా జరుపుకొంటున్నామని , నూతన పాలకవర్గం కస్టపడి పంట పండించే రైతుల ప్రయోజనాలు కాపాడాలని, రాష్టంలో కూటమి ప్రభుత్వ పధకాలు రైతులకు అందేలా బాధ్యతగా మెలగాలని పిలుపు నిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు, తోట సీతారామలక్ష్మి, టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి , మాజీ మునిసిపల్ చైర్మెన్ మెఱగాని నారాయణమ్మ, ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు జిల్లా బిజెపి అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, చెనమల్ల చంద్రశేఖర్ తదితర కూటమి నాయకులు, –రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *