సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి .. చల్లని తల్లి, విశాలమైన నేత్రాలతో తన భక్తుల మనోభీష్టాలు తీర్చే.. కల్పవల్లి గా తెలుగునాట ప్రసిద్ధి పొందిన శ్రీ మావుళ్ళమ్మ తల్లికి.. ఈనెల 22 తేదీ సోమవారం నుండి వైభవముగా ప్రారంభం కానున్న… దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలలో విశేష కుంకుమార్చనలు, చండిహోమాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలుకు భారీ పందిరి, లైటింగ్ అలంకరణలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ దసరా ఉత్సవం ప్రారంభ సూచకంగా ఈ నెల 21 అనగా ఆదివారం మద్యాహ్నం గం.3.00 లకు దేవస్థానం నుండి శోభాయాత్ర వైభవంగా జరుపబడుతుందని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మాశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. ఈ శోభాయాత్ర.. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరి.. శ్రీ అమ్మవారి పూరిగుడి,.. శ్రీ భీమేశ్వర స్వామి గుడి,.. పొట్టి శ్రీరాములు సెంటర్, …ఆంద్ర బ్యాంకు రోడ్,… తాలూకా ఆఫీసు రోడ్ మీదుగా దేవస్థానం వద్దకు చేరుతుందని, ఈ మహత్తర కార్యక్రమంలో, పాల్గొనదలచిన భక్తులు.. చిన్న బిందే కాని, చెంబు కాని పట్టుకొని రావాలని దేవస్థానం సహాయ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *