సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తనపై ట్రంప్ పెంచిన 100 శాతం సుంకాలపై చైనా కూడా అదే దూకుడు ప్రదర్శించడం తో అమెరికా చేసేదిలేక వెనక్కు తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా సురక్షిత పెట్టుబడులు గా భావించే బంగారం వెండి ధరలు తగ్గడం ప్రారంభించాయి. అందులో భాగంగా భారత్ లో నేడు, సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ధరలు మరింతగా తగ్గాయి. మరల డాలర్ బలపడుతుండటం వెరసి మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో నేడు ట్రేడింగ్‌ మొదట్లో పసిడి ధరలు తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 1,140 మేర తగ్గి రూ. 1,24,480కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1050 మేర తగ్గి రూ.1,14,100 వద్దకు చేరుకుంది హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడా ఇవే ధరలు నేడు, సోమవారం ఉదయం కొనసాగుతున్నాయి. మరో 10 రోజులలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *