సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసీపీ ప్రభుత్వహయాంలో నిర్మించిన, నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ పిపిపి ముసుగులో ప్రవేటు పరం చేస్తుందని, ఇక పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదని వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించి కోటిపైగా ప్రజా నిరసన సంతకాలు సేకరించి రేపు జగన్ నేతృత్వంలో గవర్నర్ కు సమర్పిస్తున్న నేపథ్యంలో.. నేడు, బుధవారం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తీ చేస్తేనే ప్రజలకు మెరుగ్గా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని కానీ పీపీపీ పద్ధతిలో బయటివారు మిగతా మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని అన్నారు. . మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని తెలిపారు. పేదలకు 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా ఆయా కళాశాలల్లో అందుతాయని.. సీట్లు కూడా పెరుగుతాయని అన్నారు. విశాఖలో రూ.500 కోట్లతో రుషికొండ ఫై భారీ ప్యాలెస్ నిర్మించి జగన్ హయాంలో డబ్బులు వృధా చేశారని మండిపడ్డారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *