సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం నూతన ధర్మ కర్తల మండలి లో 13 మంది సభ్యుల నియామకంతో సుదీర్ఘ కాల విరామం తరువాత నేటి మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం .. మొదటి సభ్యుడుగా( చైర్మెన్) బొండాడ నాగభూషణం ఇక మిగతా సభ్యులుగా రామాయణం శ్రీనివాస్, వుడిసి మణికాంత మీనాక్షి, అథికెల అంజనేయ ప్రసాద్, గుడిసి జనకి నాగ శిరీష కరెంపుడి ఆదిలక్ష్మి , అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం ,మిర్తిపాటి గుణేశ్వర రావు , మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు ,పాపోలు యేడుకొండలు లును నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
