సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ సహకారంతో 62 వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతూ.. చివరి అంకంలోకి ప్రవేశించారు ఈ నేపథ్యంలో శ్రీ అమ్మవారు ఈనెల 13వ తేదీవరకు రోజుకో దేవి అవతారాలలో భక్తులకు దర్సనం ఇవ్వనున్నారు. ఈనెల 11తో అంటే నేటితో వేదికపై ఆధ్యాత్మిక వినోద , నాటక కార్యక్రములు ముగియనున్నాయి. అయితే 2 రోజుల విశ్రాంతి అనంతరం ఈనెల 13 తేదీన ఉదయం శ్రీ అమ్మవారు, శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజున సుమారు ‘లక్ష మంది’ భక్తుల కోసం భారీ అన్నసమారాధన కు ఏర్పాట్లు చెయ్యనున్నారు. నేడు, మంగళవారం శ్రీ అమ్మవారు శ్రీ విజయ లక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.( ఫై చిత్రంలో) భారీ లైటింగ్ పందిళ్ళ అలంకరణలు, మధ్య వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చిన వేలాది భక్తులు శ్రీ అమ్మవారిని అష్ట లక్ష్మి అలంకారాలలో దర్శించుకొంటున్నారు. నేటి మంగళవారం సాయంత్రం 5 గంటలకు సినీ మ్యూజికల్ నైట్ మరియు రాత్రి గంటలకు గాయో పాఖ్యానం నాటకం ప్రదర్శితమవుతుంది. భక్తుల దర్శన ఏర్పాట్లను సౌకర్యాలను ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేశ్‌ పర్యవేక్షిస్తున్నారు. వన్‌టౌన్‌ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *