సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 28) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రాజమండ్రి కి చెందిన తిరుమల విద్యాసంస్థ యజమాని, బోర్డు డైరెక్టర్ నున్న సురేష్ (52) మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు కు సోదరుడు కావడం తో ఈ ప్రమాద కేసు సంచలనంగా మారింది.. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. నున్న సురేష్ తన కుటుంబ సభ్యులు నున్న విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరారు. బొమ్మలూరు టోల్‌గేట్ సమీపానికి చేరుకోగానే ముందుగా నిలిపి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో నున్న విమల దేవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
