సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య రామ మందిరానికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కోట్ల రూపాయలు కానుకలు, వెండి ఇటుకలు ఇతర విరాళాల చోరీ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు తాజగా కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్‌ను ఆదేశిస్తూ డెడ్‌లైన్ విధించింది న్యాయస్థానం.ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. అయితే.. ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను పారదర్శకంగా వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *