సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ , భీమవరం బ్రాండ్ వెటకారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ క్రైమ్ ఎంటర్టైనర్ ‘ ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47′ (AK47).వచ్చే అక్టోబర్ 2న దసరా కానుకగా రిలీజు కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో ‘అనిల్ రావిపూడి తరహాలో అదే స్కూల్ ను ఫాలో అవుతున్నారు మేకర్స్,. ఒకదాని వెనుక ఒకటి ..రోజుకో పాత్రను పరిచయం అప్డేట్స్ ప్రమోషన్ గింప్స్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్ర పరిచయ గ్లింప్స్‌ను విడుదల చేశారు.ఇంటి నుంచి తీవ్ర ఫ్రస్ట్రేషన్‌తో బయటకు వస్తున్న ‘చిట్టిబాబు’ (వెంకటేష్) వెనకాలే రఘుబాబు కూడా నడుచుకుంటూ కనిపిస్తారు. “ఈ ఆడాళ్లకు ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు” అని చిట్టిబాబు తెగ ఫీలవుతుండగా, ఎదురింట్లో ఉన్న నివేదా పేతురాజ్ ఎంతో ముద్దుగా నవ్వుతూ ‘హాయ్’ చెబుతుంది. దాంతో ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయిన చిట్టిబాబు.. “అదండీ ఆడదంటే.. ఎలా పువ్వులా నవ్వుతుందో చూడండి! నా పెళ్లాం ( స్వర్ణ ) ఉంది.. ఎప్పుడో పెళ్లి ఫోటోల్లో ‘ స్మైల్ ప్లీజ్ ‘ అంటే నవ్వింది. మళ్లీ ఇప్పటివరకు నవ్వలేదు, ముఖం ఎప్పుడూ అదోలా పెట్టుకుంటుంది” అంటూ భార్యపై చూపించే ఫన్నీ ఫ్రస్ట్రేషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. కట్ చేస్తే, కార్లో కూర్చున్న కమెడియన్ సత్య ‘ఆదర్శ కుటుంబం’ అంటూ ఎద్దేవా చేస్తున్న వీడియోకే హైలైట్‌గా నిలిచింది.
