సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసిన 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కులను 44 మంది లబ్ధిదారులకు నేడు, మంగళవారం అందజేశారు. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా సీఎం చంద్రబాబు పేద మధ్య తరగతి ప్రజలు అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదలకు భరోసాగా ఎన్డీఏ కుటమీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ..నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డుల నుండి వచ్చిన దరఖాస్తులను ముఖ్యమంత్రి ఆర్థిక సహాయానికి తోట సీతారామలక్ష్మి సిఫార్సు ద్వారా నేటి వరకు సుమారు కోటి రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఇందుకురి రామలింగరాజు ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు డైరెక్టర్స్ ఉప్పులూరి చంద్రశేఖర్ పామర్తి వెంకటరామయ్య తదితర నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
