సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో ఆదాయపు పన్ను శాఖ వారు అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్ పై వ్యాపారస్తులకు, సభ్యులకు, టాక్స్ పేయర్స్ కు, ఆడిటర్స్ కు,టాక్స్ కన్సల్టెంట్స్ కు, అకౌంటెంట్స్ కు అవగాహన కల్పించుటకు భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భీమవరం ఇన్ కం టాక్స్ ఆఫీసర్ M.నీలాచలం ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. వారి ఆధ్వర్యంలో అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్ పై సభ్యులకు వాటికి సంబంధించిన టాక్స్ వివరములు అన్నియు తెలియజేస్తూ స్క్రీన్ పై వివరంగా తెలిపారు. ఈ సదస్సు భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి నాగ వెంకట శివ సత్య కృష్ణమూర్తి (శివ)అధ్యక్షతన జరిగినది. చాంబర్ పూర్వాధ్యక్షులు, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా , ఉపాధ్యక్షులు ఒబిలి శెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు సంగడి బుజ్జి, R. V. ప్రసాద్, సుంకర చినబాబు, కోశాధికారి కురిసేటి కుమార్ బాబు, ఛాంబర్ సభ్యులు ఆడిటర్లు టాక్స్ కన్సల్టెంట్స్ అకౌంటెంట్స్ పట్టణంలోని వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *