సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేటికి శుక్రవారం 14వ రోజుకు చేరుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు.దానితో ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభమైన వేళ దానికి ప్రతిగా ఇరాన్ తన సరిహద్దు గల్ఫ్ దేశాలతో సహా అమెరికా ఇజ్రాయిల్ ఫై చేసిన ప్రతీకార దాడులు సత్తా ప్రపంచాన్ని అబ్బురపరచాయి. అలాగే యావత్తు ప్రపంచాన్ని సమస్యలలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు తో తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు, శుక్రవారం ఫోన్ చేశారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ తీవ్రత పెరగడం, యుద్ధంలో సామాన్య ప్రజలు, పౌరుల ఆస్తులు ధ్వంసం కావడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని నేపథ్యంలో పరిస్థితులు విపరీత పరిణామాల వైపు దారితీస్తుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్ పౌరుల ప్రాణనష్టం అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడంపై ఆందోళన వ్యక్తం చేసారు. అలాగే ఇరాన్ లో భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, నిరంతర ఇంధన సరఫరా వంటివి భారత్ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా.. శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమన్నాను’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
