సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని  ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరగడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి జె  ఎన్ వి గోపాలన్  అన్నారు. ఆచంట నక్కల కాలువ మట్టి తరలించిన ప్రదేశాన్ని సిపిఎం బృందం పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గోపాలన్ మాట్లాడుతూ  మట్టి తరలింపు అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. మట్టి ని తరలించకపోతున్న వారిని ఆపడం మానేసి నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకుని  సుమారు 30 మందిని  అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు.  నక్కల కాలువ ప్రక్కన లంక భూమిలో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల పెద్ద పెద్ద గండ్లు పడి రానున్న వర్షాకాలంలో పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతూ నిబంధనలు తొంగలో తొక్కిన సరే.. . భూగర్భ గనుల శాఖ అధికారులు నిమ్మకు నిరత్తినట్లు వ్యవహరించడం ఫై సిపిఎం పోరాడుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *