సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై నేటి సోమవారం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక మరో దుర్ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో జరిగింది. గత ఆదివారం సాయంత్రం కట్టనార్‌పట్టిలోని ‘వనజ ఫైర్ వర్క్స్ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 22 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. చాలా వరకు మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతా మారాయి. ఫ్యాక్టరీలో గత ఆదివారం దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు దుర్ఘటనలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. బాధితులను వారి కుటుంబాలను అదుకొంటామని హామీ ఇచ్చారు.
