సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు సమక్షంలో నేడు, మంగళవారం ఉదయం నిర్వహించిన ఆకివీడు మున్సిపాలిటీ కి చెందిన 20 మంది కౌన్సెలర్స్ ( వీరిలో ఏకంగా 16 మంది అధికార వైసీపీ కౌన్సెలర్స్ కావడం గమనార్హం) సర్వసభ్య సమావేశంలో, ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణము చెయ్యడానికి నగర పంచాయితీకి అనుమతి ప్రతిపాదన చెయ్యగా మొత్తం 20 మంది సభ్యులలో ఏకంగా 19 మంది సభ్యుల సంపూర్ణ మద్దతుతో ఆమోదించబడింది. స్థానిక ఎమ్మెల్యే గా ఎక్స్ అఫిషియో సభ్యునిగా సమావేశానికి హాజరు అయిన రఘురామ కృషంరాజు దీనితో ఈ పుణ్యకార్యానికి తమ మద్దతు తెలిపిన సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ వారిని అభినందించారు. తదుపరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామా మాట్లాడుతూ.. .. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీ రామాలయ పునర్నిర్మాణానికి చట్టప్రకారం ప్రజా ఆమోదం, ప్రభుత్వ అనుమతి కావాలని ఆదేశించారని ఇప్పుడు స్థానిక నగర పంచాయితీకి స్థానిక ప్రజలచే ఎనుకోబడిన ప్రజా ప్రతినిధుల మొత్తం ఆమోదం కూడా లభించిందని కౌన్సిల్ సభ్యులు అందరికి కృతజ్ఞతలు చెపుతున్నానని, ఇప్పుడు స్థానిక ప్రజా ఆమోదం కూడా లభించినట్లే అన్నారు. ఇక పార్మాలిటీస్ పూర్తీ చేసి స్థానిక ప్రజల కోరిక మేరకు తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయాలకు అతీతంగా దేవాలయంనిర్మాణానికి దాతల సహకారంతో తాను ఇచ్చిన మాట ప్రకారం రామాలయం సుందరంగా పూర్తీ చేయిస్తానని రఘురామా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *