సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ చర్చలకు దూరంగా ఉంటానని పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు రానని ప్రకటించడం తో అమెరికా కూడా చర్చలు వాయిదా పడ్డాయని ప్రకటించడం తో వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన భారత్ లోని దేశీయ సూచీలు నేడు, బుధవారం నష్టాల బాట పట్టాయి., అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు సూచీలను వెనక్కి లాగాయి. గత మంగళవారం సెషన్ ముగింపు (79,273)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 250 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే నడిచింది. చివరకు సెన్సెక్స్ 756 పాయింట్ల నష్టంతో 78,516 వద్ద రోజును ముగించింది. మళ్లీ 79 వేల మార్క్ దిగువకు పడిపోయింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 198 పాయింట్ల నష్టంతో 24,378 వద్ద ఆగిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 114 పాయింట్లు లాభాలు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.79గా ఉంది.
