సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలోశ్రీఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నేడు బుధవారం దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన జగద్గురు శ్రీ ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళు జీవించినప్పటికీ ఆసేతు భారతావనిలో పలుమారులు పర్యటించి స్వల్ప కాలంలోనే సనాతన హిందూ ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించారో, వారు రచించిన స్తోత్రాలు, భాష్యాల ద్వారా అర్ధం అవుతుంది. భారతీయ తత్వశాస్త్రంలో శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని, నేటి సమాజానికి దాని ఆవశ్యకత తెలియపరచ వలసిన ఆవశ్యకత ను, హైందవ ధర్మ పరిరక్షణకు దేశం నలుమూలల నాలుగు పీఠాలను స్థాపించి, సాంస్కృతిక సమైక్యతకు వారు చేసిన కృషిని ధర్మకర్తలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *