సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కు టీడీపీ నేతల మధ్య అసహనం రగులుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలలో ఇరు పార్టీల స్థానిక నేతలు తమకు ప్రాధాన్యత ఇవ్వడడం లేదని ఇరువురు నేతలు ప్రోటోకాల్ గుర్తింపు నేపథ్యంలో వివాదాలకు దిగుతున్న ఘటనలు భీమవరం’ మొదలు ‘పిఠాపురం’ వరకు కోకొల్లు.. ఈ నేపథ్యంలో టీడీపీ అదినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు కూటమి పార్టీలతో ఐక్యంగా వ్యవహరించాలని ఆదేశించారు. టీడీపీ నేతలు ప్రొటోకాల్ పేరుతో, ఫ్లెక్సీల్లో ఫొటోల ప్రాధాన్యం కోసం ఘర్షణ పడటం సరికాదని, నేతలు వ్యక్తిగత ప్రాధాన్యం కోసం పోటీ పడకూడదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమావేశం సందర్భంగా జరిగిన ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహరించిన తీరు బాగోలేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు తన టికెట్ పవన్ కళ్యాణ్ కు ఇచ్చేసి అతని గెలుపుకు కృషి చేసిన కూడా,హుందాగా వ్యవహరించాలని పార్టీ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు.ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలకు లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, .భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *