సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపట్టణంలో ఆధునిక హంగులతో రోటరీ జూపూడి సూర్య కృష్ణ పార్క్ ఎడ్వర్డ్ ట్యాంక్ ను ఎమ్మెల్యే అంజిబాబు, జేసి రాహుల్ కుమార్, ఆర్డీవో ప్రవీణ్ కుమార్, దాత సంజయ్ జూపూడి లతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. సుందరీకరణ పనులలో భాగంగా భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ ను ఎంతో అందంగా తీర్చిదిద్దరన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందించేందుకు పార్క్ లు దోహదం చేస్తాయని తెలిపారు. భీమవరం అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జూపూడి విశ్వనాధం శాంతి, రోటరీ క్లబ్ సభ్యులు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
