సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వన్ టౌన్ పరిధిలో 33 కెవి లైన్ కు డ్రోన్ టెకనాలజీ సహకారంతో ఏర్పటు చేసిన నేపథ్యంలో సుమారు మధ్యాహ్నం 2న్నర గంటల వరకు విద్యుత్తూ నిలచిపోయింది. ఇక ఫై పట్టణ ప్రజలకు మరింత సమర్ధవంతంగా క్వాలిటీ కూడిన విద్యుత్తూ సరఫరా చెయ్యడానికి అవకాశం దక్కింది. చాల కష్ట సాధ్యం అయిన ఈ పని విద్యుత్తూ ఉద్యోగులు ఎర్రటి ఎండలో లైన్ మెన్స్, ఆధునిక డ్రోన్స్ సహకారంతో స్తంబాలకు కలుపుతూ చాల వేగంగా సుమారు 2 కిలోమీటర్ మేర అంటే 3 టౌన్ లో ఉన్న ట్రాన్స్ కో కార్యాలయం నుండి వన్ టౌన్ లో పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న విద్యుత్తూ ప్రధాన కార్యాలయం వరకు వెయ్యడం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో పట్టణంలో పలు ట్రాన్స్ పారమ్స్ కూడా మరింత సమర్ధవంతంగా పని చేసేలా పనులు చేపట్టారు.. మరో 2 రోజులు పాటు పట్టణంలో పలు చోట్ల 33 కెవి లైన్ సెట్టింగ్స్ లో భాగంగా స్వల్ప సమయం విద్యుత్తూ సరఫరా ఆగే అవకాశం ఉందని ప్రజలు గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *