సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం లోని మోడీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యంతో”ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026”ప్రారంభించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ కలిసి తాజగా ఈ స్కీమ్‌ను లాంచ్ చేసారు. విద్య: 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమాతో పాటు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు: 18 నుంచ్ 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్లు లేదా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న వారు దీనికి అనర్హులు. ఈ స్కీమ్ కింద ఎంపికైన వాళ్లకి ప్రభుత్వం, సదరు కంపెనీలు కలిసి ఆర్థికంగా అండగా ఉంటాయి. ప్రతి నెలా రూ.9,000 స్టైఫండ్ అందుతుంది. జాయినింగ్ గ్రాంట్: ఇంటర్న్‌షిప్‌లో చేరిన వెంటనే ముందుగా రూ. 6,000 ప్రోత్సాహకంగా అందిస్తారు.మరియు ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందుతారు. ఈ శిక్షణ 6 నుంచి 9 నెలల పాటు ఉంటుంది. ఆసక్తి గల యువతmybharat.gov.inపోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ విద్యార్హతకు తగిన ‘రోల్’, ప్రాంతాన్ని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాల కోసం pminternship.mca.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
