సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ యూ ట్యూబర్, హాట్ హాట్ పోజులు ఇచ్చే బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి(Ashu Reddy), ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తాజగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో లండన్ లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ధర్మేంద్రను పెళ్లి చేసుకొంటానని నమ్మించి 5 కిలోల బంగారం, ,ఒక ప్లాట్ తో సహా సుమారు రూ.10 కోట్ల మేర ఆస్తులు కొనిపించుకొని మోసం చేశారనే ఆరోపణలుఫై హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) పోలీసులు.. అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి సహా వారి కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అషురెడ్డి భారీ మొత్తంలో నగదు, బంగారం వసూలు చేసిందని బాధితుడి తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వీరి పెళ్లి విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ఇరు కుటుంబాలు జాతకాలు కూడా చూపించుకున్నారని, ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత, డబ్బులు తిరిగి ఇవ్వలేదని మళ్లీ పెళ్లి చేసుకుంటానని రెండోసారి కూడా ధర్మేంద్రను నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజానికి అషురెడ్డి తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి ఈ డ్రామా ఆడిందని, వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని ‘హనీట్రాప్’ చేసిందని బాధితుడి తండ్రి ఫిర్యాదు కాపీలో వివరించారు. ..డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే, ఎదురుగా తనపైనే కేసు పెడతానని అషురెడ్డి బెదిరింపులకు పాల్పడిందని బాధితుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *