సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో కాళ్ళ మండలం లో పురాణాల ఆధారంగా 450 ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామం లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు నేడు, శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. నేడు, శనివారం కూడా కావడంతో ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు ఈ నెల 25న ప్రారంభమైన కల్యాణోత్సవాలు .వచ్చే మే నెల 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మే 9వ దేవాలయం సమీపంలోని శ్రీవారి తోటలో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్ తెలిపారు. గోదావరి జిల్లాల నుండి వచ్చే వేలాది భక్తులకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో హైలైట్ గా నిలిచే శ్రీ దేవేరులతో శ్రీవారి 30 అడుగుల రధోత్సవం ఈనెలమే 1వ తేదీన మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పట్లు చేస్తున్నారు.
