సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి వాషింగ్టన్ డీసీలో హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌ సందర్భంగా కాలిఫోర్నియా కు చెందిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపి అందర్నీ భయబ్రాంతులకు గురి చెయ్యడం సంచలనం రేపింది. అయితే ట్రంప్ సురక్షితంగా భద్రతా వలయం తో బయట పడ్డారు. నిందితుడు దొరికిపోయాడు. ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు అమెరికా కీలక నేతలు పాల్గొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో హిల్టన్ హోటల్‌లో ప్రపంచ ప్రఖ్యాత ‘పీస్’ సంస్థ అడ్జక్షుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. హోటల్ నుంచి ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘వాషింగ్టన్ డీసీ, హిల్టన్ హోటల్‌ నుంచి మాట్లాడుతున్నాను. గంట, రెండు గంటల క్రితం ప్రెసిడెంట్ ట్రంప్‌ను ఓ షూటర్ షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ హోటల్‌కు చాలా సెక్యూరిటీ ఉంటుంది’..‘37 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. లోపలికి ఎవరు రావాలన్నా సెక్యూరిటీ చెకింగ్స్ ద్వారానే రావాలి. అమెరికా అధ్యక్షుడు లోపల ఉండగా షూటర్ ఎలా వచ్చాడు?కాల్పుల్లో ఎవరికీ ఏ హానీ జరగలేదు. ప్రపంచంలో శాంతి కరవైంది. యుద్ధాలు ఎక్కువై పోయాయి’ అని వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *