సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వేసవి కాలంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మిశ్రమంగా ఉంది. ఓ వైపు తేలికపాటి వర్షాలు, మరోవైపు తీవ్రరూపం దాల్చుతున్న ఎండలతో రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉంది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా.. ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నిన్న శని, నేడు ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వర్షాలు కురిసినప్పటికీ.. మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాలలో వాతావరణం పొడిగా మారుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నారు అంటే 40-4 3 డిగ్రీల కు పైమాటే ఉండే అవకాశం ఉంది ఈనేపథ్యంలో . వాతావరణ శాఖ ఏపీవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరిజిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండనుంది. .
