సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తారాస్థాయికి చేరింది. చాల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు, వాహనదారుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, ఆటో వాలాలు, టాక్సీ డ్రైవర్స్ పని చేద్దామన్న డీజిల్ లేక భార్య పిల్లలను ఎలా పోషించుకోవాలో తెలియక బ్రతుకు తెరువు భయం వెంటాడుతుంది. . అందరిదీ ఒకటే మాట.. కరోనా సమయంలో కూడా ఇలాంటి నరకం చూడలేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల్ని డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి.. చెరువుల దగ్గర మోటార్ల కోసం డీజిల్ కావాలంటూ పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. డీజిల్ లేకపోతే మోటార్లు పనిచేయవు.. తాము నష్టపోతామంటూ విలపిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆక్వా రైతు డీజిల్ కోసం పెట్రోల్ బంకు దగ్గర గంటల కొద్ది పడిగాపులుకాశాడు ఎదో రకంగా . రూ.500 డీజిల్ కావాలని పెట్రోల్ బంకు సిబ్బందిని మీ కాళ్లు మొక్కుతాను. చేరువులో రొయ్య పిల్ల వేసాను. అది చచ్చిపోతుంది. దయచేసి డీజిల్ ఇవ్వండి అంటూ విలపిస్తున్న . ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. రాష్ట్రంలో పరిస్థితిని చాటి చెపుతుంది. భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగ రాణి స్వయంగా రంగంలోకి దిగారు. పెట్రోల్ బంకు లను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి కృషి చేస్తున్నారు.
