సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా పోస్టులో.. తాజగా.. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం స్వాగతించించాల్సిన విషయమే .. కానీ, మంత్రి నారా లోకేష్ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత సభా వేదికపై నుంచి రాజకీయ ప్రసంగాల బదులు.. గూగుల్ నుంచి స్పష్టమైన కాలపరిమితితో ఏపీలోని యువతకు కచ్చితమైన ఉపాధి కల్పించేలా మాట్లాడి ఉంటే బావుండేది.. ప్రజలకు ఉపయోగంగా ఉండేదన్నారు .ప్రస్తుతం ఐటీ రంగంలో భారీ స్థాయిలో లే ఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు) అవుతున్నాయని ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. కాబట్టి గూగుల్ ద్వారా ఎంతకాలంలో, ఏయే విభాగాల్లో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఏపీ ప్రజలకు స్పష్టంగా భరోసో ఇస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఐటీ కంపెనీల కోసం ఏపీ ప్రభుత్వం తక్కువ ధరలో ఎకరా 99 పైసల రాయితీతో భూములు ఇచ్చేయడం కాదని వాటివల్ల ఆ సంస్థల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిరంతరం, భారీగా ఉపాధి కల్పనకు ఉపయోగపడేలా ఈ రాయితీలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా పారదర్శకత తో ఉండాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *