సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ముందుగా అమెరికా సైనిక యుద్ధ తంత్ర బలగాన్ని అత్యంత అధునాతనంగా లెక్కవేసుకొని అదే తమకు రక్షణగా భావించిన గల్ఫ్ దేశాలు ఫై ఇరాన్ దాడులతో ఆ మత్తు వదిలిపోయింది. యుద్ధం నేపథ్యంలో తమ లొసుగులు తెలుసుకొని, మబ్బులు తొలగిపోయి గల్ఫ్ దేశాల స్వతంత్ర నిర్ణయాలు తీసుకొంటున్నాయి. అందులో భాగంగా ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి కూటమి అయిన ఒపెక్ (OPEC)నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బయటకు రాబోతోంది. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయం వల్ల ముడి చమురు కోసం పూర్తిగా దిగుమతుల పైనే ఆధారపడిన భారతదేశం లాంటి పెద్ద దేశం బాగా లాభపడబోతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ముడి చమురు శరవేగంగా శుద్ధి చేసి అమ్మడంలో ప్రపంచం లో భారతదేశంకు మంచి రికార్డు ఉంది. ఈనేపథ్యంలో చమురు ధరలను నియంత్రించడం కోసం ఉత్పత్తిని పెంచాలని చాలా కాలంగా ఒపెక్ దేశాలను భారత్ కోరుతోంది. అయితే సౌదీ ఇప్పటి వరకు అడ్డుకొంటుంది.. అయితే ఒపెక్ నుంచి స్వేచ్ఛ లభించడంతో యూఏఈ ఇకపై చమురును భారీగా ఉత్పత్తి చేయగలుగుతుంది. ప్రస్తుతం భారత ముడి చమురు అవసరాల్లో దాదాపు పది శాతం యూఏఈ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇకపై మరింత పెరగవచ్చు. రష్యా కన్నా యూఏఈ మన దేశానికీ దగ్గరలో ఉంది. దిగుమతి ఖర్చు తక్కువ. నిజానికి గల్ఫ్ దేశాలన్నింటిలోనూ యూఏఈతోనే భారత్కు స్నేహబంధం ఎక్కువ. భారత్లో పలు సంస్థలలో యూఏఈ భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది.ఏది ఏమైనా హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్న తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది.
