సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం. ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాటలో సాగుతుండడం పాజిటివ్‌గా మారాయి.భారత్ లో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయిగత సెషన్ ముగింపు (76,886)తో పోల్చుకుంటే నేటి బుధవారం ఉదయం దాదాపు 350 పాయింట్ల లాభంతో 77,245 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి దూసుకెళ్లింది. ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 916 పాయింట్ల లాభంతో 77,802 వద్ద కొనసాజినప్పటికీ తరువాత పడిపోయి 609 పాయింట్స్ తో 77,496 వద్ద ముగిసింది. ముగింపు కు . మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగింది. ఒక దశలో 275 పాయింట్ల లాభంచూసినప్పటికీ ముగింపు 182 పాయింట్స్ తో సరిపెట్టింది. 23,150 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 471 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.78గా భారీ గా పతనం అయ్యింది..( ఒక డాలర్ కు దాదాపు 95 రూపాయలు )
