సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఒక్క అడుగు ప్రభుత్వ బడి వైపు చూసి రావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు, గురువారం భీమవరం బ్యాంక్ కాలనీలో జిల్లా విద్యాశాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘బడి పిలుస్తోంది ప్రచార భేరి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఈ విద్య సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని, అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ఉచిత విద్య బోధన, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం వర్తింపు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, మధ్యాహ్న భోజన పథకం, ఆధునిక వసతి కల్పన వంటి సౌకర్యాలను కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *