సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేడు గురువారం ఉదయం 11 గంటలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను ప్రకటించారు. ఈసారి ముందుగా ఉహించినట్లే టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 81.14 శాతం ఉత్తీర్ణతతో పోలిస్తే ఈసారి మరింత మంది ఉత్తీర్ణత సాధించారు. . టెన్త్ ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు మాత్రం 82.68 శాతం ఉత్తీర్ణత పొందారు. టెన్త్ ఫలితాలను www.results.bse.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. వాట్సాప్ ‘మన మిత్ర’ సేవ ద్వారా 9552300009కు ‘Hi’ అని పంపి ఫలితాలను తెలుసుకోనే అవకాశం ఉంది. ఇక మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా – 96.07% ఉత్తీర్ణత నమోదు కాగా ,రెండో స్థానంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ : 95.85% ఉత్తీర్ణత, మూడో స్థానంలో విజయనగరం – 91.08% ఉత్తీర్ణతను ఆ జిల్లాల విద్యార్థులు సాధించారు. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా – 57.12% ఉత్తీర్ణత తో నిలచింది.
