సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉక్కపోత తో సొమ్మసిల్లుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. ద్రోణి ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాగాల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఏపీలోని దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాలోనూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో, మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముంది భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వాతావరణం చల్లబడింది. నేటి గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా పిడుగులతో కూడిన జల్లులు కురవనున్నాయి.. ఈ నేపథ్యంలో గంటకు 50- 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 – 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది.
