సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం లేదని ఎన్నికలు పూర్తీ అయ్యాక బాదుడు ఉంటుందని చాల మంది భావించి నప్పటికీ ప్రస్తుతానికి గ్యాస్ సిలెండర్లు ధరల పెంపుతో సరిపుచ్చారు.. అయితే తాజగా.. నేడు, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) సవరించినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదని, అవి స్థిరంగానే కొనసాగుతాయని ఆ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని ప్రభుత్వం, చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఇంధన సరఫరా గొలుసులో స్థిరత్వాన్ని కాపాడతామని, పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. తద్వారా కూరగాయలు, ఇతర నిత్యావసరాల రవాణా ఖర్చులు పెరగకుండా ఉంటాయి. నిజానికి రష్యా నుండి 3న్నర ఏళ్ళు పాటు భారీ సబ్సిడీకి చమురు కొన్న భారతీయ ఆయిల్ కంపెనీలు ఆ లాభాలు ప్రజలుకు, వాహనదారులకు పంచలేదు. ధరలు తగ్గించలేదు.. అన్న విషయం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *