సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ శ్రామిక దినోత్సవం వేడుకలు భీమవరంలో లెఫ్ట్ పార్టీలు,CPI,CPM శ్రామిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భీమవరం లోని పలు సెంటర్స్ కూడలిలో అరుణ పతకాలు రెపరెపలాడాయి. భీమవరం లో శ్రామిక సంఘాలు, .కామ్రేడ్ సోదరులు ర్యాలీలు, ఆటపాటలు తో ప్రధాన రోడ్లపై శ్రామిక నినాదాలతో,రాతలతో సందడి చేసాయి.నేతలు మాట్లాడుతూ.. యాజమాన్య నియంతృత్వ విధానాలు శ్రామికుల శ్రమ దోపిడీని అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్‌ ) సీపీఐ(ఎం), కీలక నేతలు నేతలు బలరామ్. డివిజన్ కార్యదర్శి జె ఎన్ గోపాలన్ ఆధ్వర్యంలో స్థానిక మెంటే వారి తోటలో సుందరయ్య భవనం వద్ద ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రపంచ కార్మిక నేతలకు నివాళ్లు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *