సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, శుక్రవారం భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో450 ఏళ్ళ క్రితం స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గత శుక్రవారం సాయంత్రం స్వామివారి సుమారు 25 అడుగుల రథోత్సవం వైభవంగా సాగింది. వేద మంత్రాల నడుమ పలు మేళతాళలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు దేవేరులతో కలసి ఆసీనులైభక్తులకు దర్శనమిచ్చారు.కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్‌ డప్పులు, మేళతాళాలు, డీజే సిస్టం భక్తులను ఉత్సహపరిచాయి. రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు దంపతులు శ్రీ స్వామివారికి ప్రత్యక పూజలు చేసి రథానికి ముందు కుంభం సమర్పించిన తదుపరి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగేందుకు గోవిందా.. గోవిందా.. అంటూ పోటీపడటంతో వీధులన్నీ ఉమ్మడి పశ్చిమ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కాళ్ళకూరులో దారులన్నీ కిక్కిరిసిపోయాయి.కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్‌కుమార్‌, ధర్మ కర్తల మండలి సభ్యులు, చైర్మెన్, ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు మే 3 ఆదివారం తో వేడుకలు ముగుస్తాయి. అయితే మే 9వ తేదీన శ్రీ స్వామివారి తోటలో భక్తులకు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *