సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ పెత్తందారీ విధానాలపై కార్మికుల పోరాటం సాధించిన విజయాలకు ప్రతీకగా.. మే డే రోజునే ప్రారంభం అయిన భీమవరం లోని మన ‘సిగ్మా సంస్థ ‘ కు ఓ ప్రత్యక అనుబంధం ఉంది. అపట్లో అమెరికా తరహా మోనోపోలీ కేబుల్ టివి వ్యవస్థకు వ్యతిరేకంగా మిసైల్స్ ఇక్కడ వాడక పోయిన ప్రస్తుత ఇరాన్ తరహా ప్యూహంతో (అమెరికా కు సహకరిస్తున్న కొన్ని గల్ఫ్ దేశాలను ఇరాన్ తన సత్తాతో వంగో బెట్టిన తీరులో..) సిగ్మా కేబుల్ టివి ( స్వతంత్ర M S O )గా చేసిన పోరాటం తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఒక సంచలనం. ‘భీమవరంలో 30 రూపాయలకే సిగ్మా కేబుల్ టివి అంట ! అని రాష్ట్రంలో ప్రజలు చెప్పుకొనేవారు.. దీనితో మోనోపలీ కేబుల్ టివి ధరలు దిగిరాక తప్పలేదు.. ఈ సిగ్మా పోరాటంతో భీమవరం పట్టణ ప్రజలకు ‘ఏకంగా 15ఏళ్ళు పైగా’ మొత్తంగా ‘కోట్ల రూపాయల డబ్బు ఆదా’ అయ్యింది.విషయంలోకి వెళ్ళితే.. భీమవరంలో 2002 లోనే నెలవారీ 150 -170 రూపాయలు పైగా అధిక ధరలు వసూళ్లు చేసే మోనోఫలి కేబుల్ టివి వ్యవస్థ ఉండేది. అప్పట్లో ప్రజలకు తక్కువ ధరలకు సర్వీస్ ఇస్తున్న సిగ్మా ను కొందరు కీలక లోకల్ లింక్ ఆపరేటర్లు సహకారంతో కేబుల్ వ్యవస్థ నుండి తొలగించాలని కుట్ర జరిగింది.. దానికి ప్రతిగా ‘సిగ్మా’ స్వతంత్ర ప్రసారాలు అందించే MSO గా అవతారం ఎత్తి మోనోపలీ వ్యవస్థకు సహకరించిన కొందరు కీలక కేబుల్ టివి ఆపరేటర్స్ ఏరియాలలో ‘ఎవరిని లెక్కచెయ్యకుండా’ స్వల్ప ధరలకు సిగ్మా ప్రసారాలు అందించి పట్టణం అంతట నెట్ వర్క్ విస్తృతం చేసింది. దీనితో వారు బ్రాడ్ కాస్టర్ ఫై వత్తిడి తెచ్చి సిగ్మా కు ప్రముఖ పే ఛానెల్స్ నిలిపివేసిన కూడా, కేబుల్ వైర్లు కత్తిరించడం,ఎన్నో తరహా దాడులు,జరిగిన కూడా 2017 నుండి దేశంలో డిజిటల్ ప్రసారాలు ప్రారంభమయ్యే వరకు ‘సిగ్మా కేబుల్ టివి విజయ కేతనం’ చరిత్రలో నిలిచిపోతుంది. 1992 లో ఒక చిన్న కేబుల్ టివి నెట్ వర్క్ గా భీమవరంలోని ఇండియన్ బ్యాంకు రోడ్డు పరిధిలో కేవలం నెలవారీ 50 రుసుముతో ప్రారంభించబడిన సిగ్మా కేబుల్ టివి ప్రసారాలలో అపట్లో ఎన్నో సాంకేతిక విజయాలు సాధించింది. పట్టణంలో తొలిసారి వార్తలు అందించేలోకల్ న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. అంతేకాదు 1994 సంవత్సరంలో పట్టణంలో తొలిసారి శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, అంత్యాక్షరి ప్రసారాలు, మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ హాలు విశేషాలు శరవేగంగా అందించి మీడియా రంగంలో చరిత్ర సృష్టించింది.. సిగ్మా కేబుల్ టివి ‘2002 మే డే రోజు’ నుండి పూర్తీ స్వతంత్రగా 3 లోకల్ ఛానెల్స్ తో పాటు 45ఛానెల్స్ 30 రూపాయలకేఅందించింది. ఆర్ధికంగా తాను ఎంత నష్టపోయిన సరే..సామాన్య కుటుంబాలకు అండగా నిలచింది. ఈ టివి , మాటివి , జీ తెలుగు వంటి ఛానెల్స్ తిరిగి సాధించడం కోసం ఢిల్లీ లోని ట్రాయ్ కోర్టులో సిగ్మా’ చేసిన పోరాటాలు అంత ఇంతా కాదు.. ఆఖరికి 2017 జనవరి నెల నుండి ప్రధాని మోడీ, కేబుల్ టివి డిజిటలైజేషన్ చెయ్యడంతో ప్రతి కేబుల్ టీవీ వినియోగదారుడు 2000 రూపాయలు పైగా ఖరీదయిన సెట్ అఫ్ బాక్స్ వాడి ‘ఛానెల్స్ బట్టి డబ్బు చెల్లించాలని’ ఆదేశాలు అమలు కావడంతో సిగ్మాకేబుల్ టివి అనివార్య పరిస్థితులలో తన 24 ఏళ్ళ తన ప్రస్థానానికి ముగింపు పలికింది. ఒక స్వచ్చంద సంస్థ తరహాలో ప్రజల కోసం పోరాడిన సిగ్మా కేబుల్ టివి పోరాటానికి అప్పట్లో సహకరించిన అందరికి ‘మే డే’ లాల్ సలాం..మీ.. సిగ్మా ప్రసాద్
